కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాల ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఈ ప్రాణాంతక వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయంలో స్పష్టమైన అవహగాన లేక ఆందోళన చెందుతున్నారు. దగ్గినప్పుడు, తమ్మినప్పుడు ఎదుటి వారిపై పడే తుంపిర్ల వలన ఈ వైరస్ సోకుతుందని ఇప్పటికే వైద్యులు స్పష్టం చేశారు. కాని ఈ వైరస్ విస్తరిస్తోన్న తీరు చూసి కరోనా వ్యాప్తి గురించి టెన్షన్ పడుతున్నారు. అత్యంత వేగంగా కరోనా ప్రపంచ దేశాలకు విస్తరించడంపై ఈ మహమ్మారి గాలి నుంచి కుడా సోకుతుందా అని కొంతమంది.. మరికొంతమంది కన్నీటి ద్వారా కుడా కరోనా ఇతరులకు సోకుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఇదివరకే వైద్యులు తేల్చిచెప్పారు. ఇక, కన్నీటి ద్వారా కుడా కరోనా సోకుతుందా అనే అంశంపై సింగపూర్ వైద్యులు పరోశోధనలు జరిపారు. కరోనా బారినపడివారి కన్నీరు ఇతరుల మీద పడిన కరోనా సోకదని..కన్నీటిలో కరోనా వైరస్ ఉండదని నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో వైద్యులు కరోనా బారిన పడిన 17మంది కన్నీటి చుక్కలను.. వారికీ నెగిటివ్ వచ్చే వరకు సేకరించి ప్రతిరోజు టెస్ట్ చేశారు. పరిక్షలు చేయగా.. రోగుల ముక్కు, నోటి స్రావాల్లో ఉన్న వైరస్.. వారి కన్నీటిలో మాత్రం లేదని వారి పరీక్షల్లో తేలింది.