కరోనా కబలిస్తోంది కేవలం వృద్దులనేనా?
మహిళల కంటే పురుషులే టార్గెట్ అవుతున్నారా?
చిన్న వయసు వారు కూడా ఎందుకు చనిపోతున్నారు?
కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది.అన్ని దేశాలు అలెర్ట్ అయ్యాయి.తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.అసలు కరోనా ఎవరికి ప్రమాదకరం?మరి ఎవరు ఆందోళన చెందాలి? రిపోర్ట్స్ చెబుతున్న వాస్తవాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
కరోనా వైరస్ వ్యాధికి వయస్సు మాత్రమే కాదు అని గమనించాలి. కానీ, వృద్దులలో అంటే 70 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా సోకితే కోలుకోవడం కష్టం. చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు, మరణాలపై విశ్లేషిస్తే ఇది స్పష్టంగా అర్ధమవతుంది.చైనా లో 80శాతం మరణాలు 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో సంభవించాయి.కొన్ని దేశాలైతే ప్రత్యేకమైన వయసు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. జపాన్ తరువాత ప్రపంచంలో వృద్దులు ఎక్కువగా ఉన్న దేశం ఇటలీ.ఇటలీలో 80 శాతం కంటే ఎక్కువ మరణాలు 70 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో సంభవించాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వయసు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.
ఇక తరువాతి కేటగిరీ 50 సంవత్సరాల లోపు వారు.ఈ వయసు వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండి, ఎక్కువ కాలం ఆసుపత్రి లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందట. ఫ్రాన్సులో ఐసియు లో చేరిన 300 మందిలో సగానికి పైగా 60 ఏళ్ల లోపు వారే.
తరువాత గమనించాల్సింది 19 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్కులను. కరోనా కేసుల్లో నాలుగింట ఒక వంతు ఈ వయసు వారు కరోనా బారిన పడ్డారని ఇటలీ చెబుతోంది.అమెరికాలో 29 శాతం మంది 20 నుండి 30 సంవత్సరాల వయసు వారే.
చిన్న పిల్లల విషయానికి వస్తే, చైనాలో 2100 మంది పిల్లలకు కరోనా సోకింది.14 సంవత్సరాల వయస్సు లోపు ఒకరు చనిపోయారు. 6 శాతం మంది తీవ్ర అనారోగ్యంతో, చాలా మంది స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కరోనా కేసుల విషయంలో వయసును పక్కన పెడితే, దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉదాహరణకు గుండె జబ్బులూ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి.చైనా 40 శాతం మందికి ఇదే ప్రధాన సమస్య. క్యాన్సర్ వంటి రోగాలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఎక్కువ ఇబ్బంది. కరోనా వైరస్ తో మరణించిన 40 కంటే తక్కువ వయస్సు ఉన్న మొదటి తొమ్మిది మందిలో, ఏడుగురికి గుండె జబ్బులు ఉన్నాయి. అంటే వయసు తక్కువగా ఉన్నవారు కూడా చనిపోవడానికి ప్రధాన కారణం వారు వివిధ రకాల జబ్బులతో బాధపడుతూ ఉండడం. చనిపోతున్న వారిలో దాదాపు సగం మంది మూడు లేదా అంతకంటే ఎక్కువ రోగాలతో ఇబ్బంది పడుతున్న వారే.చైనా , ఇటలీలో మహిళల కంటే పురుషులకే ఈ వ్యాధి ఎక్కువగా సోకింది. 50 శాతానికి పైగా కరోనా వ్యాధిగ్రస్తులు పురుషులే.
కరోనా సోకిన షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఇబ్బంది పడడానికి కారణం, ఇన్ఫెక్షన్ ఉన్న సమయంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కష్టమంటున్నరు డాక్టర్లు.ఇక ఊపిరితిత్తుల సమస్యల తో బాధపడే వారు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారు చనిపోతున్నారు.
ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం,
కేవలం 2 శాతం మంది మాత్రమే ముందస్తు జబ్బులు లేని వారు చనిపోతున్నారని మనం గుర్తించాలి.