చలికాలానికి ఎండ్ పడుతుందంటేనే భయపడిపోయే భారతదేశప్రజలు ఇప్పడు ఎండాకాలం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చిలోనే ఎండవేడిమికి తాళలేక కొంతమంది అయితే ఈ ఎండాకాలం లేకపోతే చాలాబాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేసేవాళ్ళు లేకపోలేదు. కాని ఇప్పుడంతా వేసవికాలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ.. ఎండలు రికార్డు స్థాయిలో నమోదు కావాలని కోరుకుంటున్నారు. ఇదేంటి..?ఇప్పుడు అలాంటి మార్పు అనుకుంటున్నారా..?మార్పు మంచిదేనని అంటున్నారు సైంటిస్ట్ లు.
కరోనా వైరస్ అధిక ఉష్ణోగ్రతలో మనుగడ సాగించదని.. ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందేందుకు చాన్స్ లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈక్రమంలోనే ఇండియాలోకి ముందుగానే వేసవికాలం వస్తే కరోనా తోకముడిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశ ప్రజలంతా కరోనాకు ఇప్పుడు లాక్ డౌన్ తోపాటు ఎండతీవ్రత కుడా చెక్ పెడుతుందనే భావనలో ఉన్నారు.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరిగిన దృష్ట్యా అన్ని దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనా ప్రభావం తక్కువగా ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు అందరు వేసవి ఎప్పుడు ముంచుకొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. కాని భారత వాతావరణ శాఖ తెలిపిన సమచారం నిరుత్సాహానికి గురి చేసేలా ఉంది. దేశంలో ముందస్తు ఎండకాలానికి చాన్స్ తక్కువగా ఉందని వెల్లడించింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే వేడి ప్రాంతాలైన ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండియాలోని ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే ఏప్రిల్ రెండోవారం నాటికీ ఎండ తీవ్రత భారీగా ఉండనున్న నేపథ్యంలో కరోనా ఇండియా నుంచి చాప చుట్టేసి అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.