దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరోసారి భారీ స్థాయిలో కేసులు వెలుగు చూశాయి.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,407 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నిన్న మరో 89 మంది మరణించారు. ఇక బాధితుల్లో తాజాగా 14,031 మంది కోలుకొన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో మొత్తం నమోదైన కేసులు- 1,11,56,923
కోలుకున్నవారు- 1,08,26,075
మరణించిన వారి సంఖ్య- 1,57,435
యాక్టివ్ కేసులు- 1,73,413
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య- 1,66,16,048
తాజా కేసుల్లో సగానికిపైగా కేసులు కేవలం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. నిన్న ఆ రాష్ట్రంలో ఏకంగా 9,855 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 5 నెలల తర్వాత ఇదే తొలిసారి.అటు మరణాల్లో కూడా సగం ఇక్కడే సంభవించాయి. నిన్న ఒక్కరోజే 42 మంది మృతి చెందారు.