భద్రాద్రి రాముల వారి కళ్యాణం అంటే ఉండే హాడావిడి, పోటీ పడి వచ్చే జన సంద్రోహం మాటల్లో వర్ణించలేనిది. కానీ ఈసారి భక్తులు లేకుండానే భద్రాద్రి రాముని వివాహా వేడుక జరగబోతుంది. కరోనా వైరస్ ప్రభావంతో… భక్తులు లేకుండానే శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో… జనం గుంపులు గుంపులు రావటం మంచిది కాదన్న ఉద్దేశంతో భద్రాచలం టెంపుల్ అధికారులు భక్తులు లేకుండానే శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే, చాలా మంది భక్తులు ఇప్పటికే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కళ్యాణం టికెట్లను కొనుగోలు చేశారు. దీంతో వారి డబ్బులను వెనక్కి ఇచ్చేస్తామని… రిఫండ్ ప్రక్రియను మొదలుపెట్టబోతున్నామని ప్రకటించారు. కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా… కరోనా వైరస్‌కు ఎవరూ ఏమీ చేయకపోవటం