ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 226 కు చేరుకుంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 34 కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 27 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం సాయంత్రం వరకు నాలుగు కేసులే నమోదు కాగా ఇప్పుడు ఏకంగా 27 కు చేరుకుంది. దీనితో ఒక్కసారిగా జిల్లాలో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు.
జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు..
అనంతపురం – 3
చిత్తూరు – 17
తూర్పుగోదావరి – 11
గుంటూరు – 30
కడప – 23
కృష్ణ – 28
కర్నూలు – 27
నెల్లూరు – 34
ప్రకాశం – 23
శ్రీకాకుళం – 0
విశాఖపట్నం – 15
విజయనగరం – 0
పశ్చిమగోదావరి – 15
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో వైరస్ వ్యాప్తి…