కరోనా వైరస్‌తో ఓవైపు జనం చస్తుంటే… మరోవైపు కొందరికి ఆయుధంగా కూడా పనిచేస్తుంది. కరోనా దెబ్బకు ప్రేమికుల రోజున ఎంతో ఇబ్బంది వచ్చిందే…అని సెటైర్స్ వేసుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ ఓ యువతిని కాపాడింది. అవును… చావును చూపించే కరోనా వైరస్ ఓ మహిళను సేవ్ చేసింది.
ఓ మహిళపై అత్యాచారం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. ఒంటరిగా ఉండే మహిళ ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి… ఆత్యాచారానికి ప్రయత్నించాడు. కానీ ఆమె అతన్ని ఎదుర్కొనేందుకు తెలివిగా అతని ముఖంపై దగ్గుతూ… తాను వూహాన్ నుండి వచ్చానని, కరోనా ఉందని చెప్పటంతో ఆ యువకుడు అక్కణ్నుండి వెనక్కి తిరిగి చూడకుండా పరుగెత్తాడు. అయితే ఆమె ఇంట్లో ఉన్న 30వేల విలువ చేసే కరెన్సీని మాత్రం దోచుకెళ్లాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయినా… తన తండ్రితో వచ్చి ఆ యువకుడు నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయాడు.
చైనాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.