కేంద్ర ప్రభుత్వం నుంచి కరోనా వైద్యం బృందం మంగళవారం విశాఖపట్నానికి చేరుకుంది. ముగ్గురు డాక్టర్లతో కూడిన ఈ బృందం నగరంలో పర్యటించి ఎయిర్ పోర్ట్ సిబ్బందితో పాటు నగరంలో ఎవరికైనా ఈ వైరస్ సోకిందా..? ఒక వేళ వైరస్ సోకితే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? సరైన వైద్య సదుపాయాలున్నాయా..లేవా అని పరిశీలిస్తుంది. భారత దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ఆరోగ్య మంతి హర్షవర్దన్ ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర బృందం విశాఖకు చేరుకుంది. ఇప్పటి వరకు విశాఖలో ఏ ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదు.