ఇండియాపై కరోనా వైరస్ దాడి మరింత పెరిగింది. వరుసగా రెండో రోజూ కూడా 60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 61 వేల 537 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇక మరణాల్లో మరో రికార్డ్ నమోదైంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 933 మంది మృత్యువాతపడ్డారు.
తాజా కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షల 88 వేల 612కు చేరింది. ఇందులో కరోనా నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 14లక్షలకు పైగా రోగులు కోలుకోగా.. ప్రస్తుతం 6 లక్షల 19 వేల 88 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు మరణాల సంఖ్య మొత్తం 42 వేల 518కి పెరిగింది.
ఇక దేశవ్యాప్తంగా నిన్న 5 లక్షల 98 వేల 778 శాంపిల్స్ పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది .దీంతో ఇప్పటివరకు మొత్తం టెస్ట్ చేసిన శాంపిళ్ల సంఖ్య 2 కోట్ల 34 లక్షలకు చేరువైంది