కరోనాను అంతమొందించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా జనత కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ బారి నుంచి ఇండియాను సేఫ్ చేయాలనే ఆలోచనలో భాగంగానే ఆదివారం జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు మోదీ. వస్తువులు, పలు ప్రదేశాల్లో కరోనా వైరస్ 12 గంటలు జీవించి ఉంటుందనే శాస్త్రవేత్తల సూచన మేరకు… ప్రధాని ఆదివారం రోజంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు జనాలంత ఇళ్లకే పరిమితమై జనత కర్ఫ్యును విజయవంతం చేసి ఇండియాను కరోనా బారి నుంచి రక్షించుకుందామని ప్రజలకు సూచించారు. కరోనాతో దేశ ప్రజలు ఆందోళన చెందుతోన్న నేపథ్యంలో కరోనా ఆటకట్టించేందుకు కర్ఫ్యూ విధించిన ప్రధాని నిర్ణయానికి దేశ ప్రజలు జై కొడుతున్నారు. ఒక్క రోజుతో దేశాన్ని కరోనా నుంచి సేవ్ చేయగలమంటే అందుకు మేము సిద్దమేనంటూ సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఇటలీ,ఇరాన్, చైనాలోని వుహన్ నగరంలో కంప్లీట్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇదే బాటలో చాలాదేశాలు నడుస్తున్నాయి. కరోనా నుంచి తమ దేశ పౌరులను సేవ్ చేసేందుకు పలు దేశాలు ఆంక్షలను విధించాయి. ప్రజలను ఇళ్ళ నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని ఈమేరకు ప్రభుత్వాలకు సహకరించాలని కోరుతున్నాయి. ప్రధానంగా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూరప్ దేశాల్లో ఈ ఆంక్షలను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువులను కూడా ఆన్ లైన్ లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. అదే ఇండియాలో ఒక్కరోజు సకలం బంద్ అంటే ప్రజలకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అయినప్పటికీ ప్రధాని నిర్ణయం మేరకు.. దేశ పౌరుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రజలు కుడా మోదీ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా జనత కర్ఫ్యులో భాగంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహాయించి అన్ని సేవలు బంద్ అయ్యాయి.
కరోనాకు మెడిసిన్ లేక కరోనా బాధిత దేశాలు అల్లాడిపోతున్నాయి. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు మృత్యువాత పడుతోన్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కరోనా నుంచి బయటపడటం ఎలా అని ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. భారత్ మాత్రం తవనంతు ప్రయత్నంగా కరోనాకు డెత్ వారెంట్ జారీ చేస్తూ నేడు జనత కర్ఫ్యుకు పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ఇండియా వైపు చూసేలా చేసింది. జనత కర్ఫ్యుతో ఇండియాలో కరోనా వైరస్ కట్టడి అవుతే తాము కుడా ఇదే మార్గాన్ని ఎంచుకోవాలని ఆయా దేశాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.