వైసిపి ఎమ్మెల్యేలు అవినీతికి అడ్డాగా మారారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పై కార్యకర్త హరిశ్చంద్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో సీట్లు, టిక్కెట్ల కోసం లక్షలు దండుకోంటున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేల అవినీతితో లీడర్స్, క్యాడర్ అల్లాడిపోతున్నారని ఆరోపించారు.
గూడూరు ప్రజా ప్రతినిధి నాదగ్గర 10 లక్షలు తీసుకున్నాడని హరిచంద్ర రెడ్డి ఆరోపించారు. ఇలా ఎంత మంది దగ్గర ఎన్ని కోట్లు దండుకున్నారోనని హరిచంద్ర రెడ్డి అన్నారు. ఆ డబ్బంతా ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు.