లంచాలు తీసుకుంటూ ఏసీబీ వలలో పడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ బిల్లుకు సంబంధించిన ఇష్యూలో లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశాడు శంకర్. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు.. వల పన్ని ఆర్డీవోను పట్టుకున్నారు.