వికారాబాద్ జిల్లా పరిగి పదవ వార్డ్ కౌన్సిలర్ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మహిళ అని చూడకుండా తన కుటుంబంతో కలిసి దాడికి పాల్పడ్డారు. పరిగి మండల పరిధిలోని కిష్టమ్మ గుళ్ళ తాండకు చెందిన సోమ్లీ బాయ్ అనే మహిళను ఇష్టానుసారంగా చితక బాదారు.
పదవ వార్డుకు చెందిన కౌన్సిలర్ శ్రీనివాస్ తన ఇంటి దగ్గర ఉన్న సిమెంట్ కూర్చిని సచిన్ అనే బాలుడు విరగొట్టాడని, కొట్టి పంపించాడు. తనను కౌన్సిలర్ శ్రీనివాస్ కొట్టాడని తన నాయినమ్మతో చెప్పాడు బాలుడు సచిన్.
మనమడు సచిన్ చెప్పడంతో అడిగేందుకు సోమ్లి బాయ్ వెళ్లింది. మహిళ అని చూడకుండా నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి, దురుసుగా ప్రవర్తించాడు.
అంతటితో ఆగకుండా కౌన్సిలర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టానుసారంగా ఒంటిపై వాతలు వచ్చే విధంగా చితక బాదారు. దెబ్బలకు తాళలేక సోమ్లీ బాయ్ పరిగి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలర్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసింది.