హైదరాబాద్‌లో కరోనా సోకిందన్న భయంతో వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలవరం రేపగా….. అనంతపురం జిల్లాలో భార్యాభర్తలు కరోనా కారణంగా వీధిలో తమ పరువు పోయిందన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.
ధర్మవరం మండలం పెరువీధిలో నివాసముంటున్న ఓ కుటుంబానికి కరోనా సోకింది. ఈ కుటుంబంలో ఒకరు వారం క్రితం చనిపోయారు. అదే ఇంట్లో ఉండే దంపతులు క్వారంటైన్ సెంటర్‌లో చికిత్స పొందారు. పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వారిని తాజాగా డిశ్చార్జ్ చేశారు. అయితే కరోనా కారణంగా ఇంట్లో ఒకరు చనిపోయారన్న ఆవేదన, అందరూ ఏమనుకుంటారోనన్న ఆలోచన వారిని కుంగదీసింది. దీంతో రాత్రి తాముండే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.