బహిరంగ ప్రదేశాల్లో జంటలు హద్దుమీరి ప్రవర్తిస్తుండడం ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా సహజమే అయింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో మనకు ఈ పోకడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రజా రవాణాకు ముఖ్యమైనదిగా భావిస్తున్న మెట్రో రైళ్లలోనూ జంటలు రొమాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఢిల్లీలో అలాంటిదే ఒక ఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీ మెట్రో రైల్‌లో ఒక జంట అందరి ఎదుట ముద్దులు పెట్టుకుంటూ బహిరంగంగా రొమాన్స్‌కు దిగారు. అయితే చుట్టు పక్కల ఉన్నవారికి ఇది ఎంతో ఇబ్బందిని కలిగించింది. కొందరు ఆ జంట చేస్తున్న పనిని తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఇక కొందరు వారిని ఆ పనిచేయడం ఆపాలని, లేదంటే దాడి చేస్తామని బెదిరించారు.
@OfficialDMRC
Why DMRC not taken any action against these kind of activities…..is this is a fare happened in public transportation.
Being a civilian i complaint against to DMRC…Young couple caught kissing in Delhi Metro, video goes viral https://t.co/TDDXR6Nety
— Manish Dhama (@Manishdhama0) December 8, 2019
అయితే పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ అఫెక్షన్ (పీడీఏ) ను భారత్‌లో అబ్‌సీన్ యాక్ట్ కింద చేర్చారు. ఐపీపీ సెక్షన్ 294 ప్రకారం అలాంటి పనులకు పాల్పడేవారు శిక్షార్హులు. అదేవిధంగా అలాంటి పనులు చేసేవారిని వారి అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయడం కూడా శిక్షార్హమే. అలాంటి వారికి గరిష్టంగా 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ క్రమంలో ఆ జంట అలా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.