ఫైనాన్స్ కంపెనీ ఇన్ఫీబీమ్ కార్పొరేట్ ఫైనాన్స్ హెడ్ ఆర్. శ్రీకాంత్, ఆయన భార్య అనురాధ హత్యకు గురయ్యారు. ఈ ఘటన చెన్నైలోని మైలపూర్ లో చోటుచేసుకుంది. అయితే.. వారిని వారి డ్రైవరే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ దంపతులిద్దరు అమెరికాలోని కూతురు దగ్గరికి వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చారు.
అమెరికాలో తన దగ్గర్నుంచి తిరిగి వెళ్లిన తల్లిదండ్రులకు కాల్ చేసిన కూతురు.. వారి ఫోన్లు స్విచాఫ్ రావడంతో అనుమానం వచ్చి తన బంధువులకు సమాచారం అందించింది. వారు శ్రీకాంత్ ఇంటికి వెళ్లగా.. దంపతులు కనిపించలేదు. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రరంభించిన పోలీసులు. శ్రీకాంత్ ఇంట్లోని రక్తపు మరకలను గమనించారు. డ్రైవర్ పై అనుమానం వచ్చిన పోలీసులు.. డ్రైవర్ ఫోన్ వివరాలు, ఫాస్టాగ్ ల మెసేజ్ ల ఆధారంగా అతను చెన్నై-కోల్‌కతా హైవేలో వెళ్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు.
ఒంగోలుకు చేరుకున్న డ్రైవర్ కృష్ణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. తనే దంపతుల్ని హత్య చేసినట్టు డ్రైవర్ అంగీకరించాడు. వారినుండి విలువైన వస్తువులను దొంగలించినట్టు చెప్పాడు. ఆ తర్వాత వారి బాడీలను ఫామ్ హౌస్‌లో కాల్చేసినట్టు వెల్లడించాడు. ఫామ్ హౌస్ కు చేరుకున్న పోలీసులు శ్రీకాంత్, అనురాధ బాడీలను సేకరించి, పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రస్తుతం ఇన్ఫీబీమ్ కార్పొరేట్ ఫైనాన్స్ హెడ్ గా ఉన్న శ్రీకాంత్.. అంతకుముందు జియో ఇన్ఫోకామ్ కు, పోలారిస్ ఫైనాన్సిల్ టెక్నాలజీ లిమిటెడ్‌కు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా పనిచేశారు.