విజయవాడలో సంచలనం రేపిన అయేషా మీరా హత్య కేసులో సీబీఐ వేసిన పిటిషన్ ను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఈ హత్య కేసులో అనుమానితులకు నార్కొ అనాలసిస్ టెస్ట్ చేసేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును కోరింది. 2007, డిసెంబర్ 27న హత్యకు గురైన అయేషా మీరా హత్య కేసులో కోనేరు సతీష్ తో పాటు మరో ఏడుగురిని నార్కో అనాలసిస్ టెస్టులకు అనుమతించాలని సీబీఐ కోర్టును కోరింది.
సతీష్ చెప్పే అంశాలతో పాటు అయేషా మీరాతో హస్టళ్ లో ఉన్న ఆమె స్నేహితురాళ్ల సమాచారం కూడా కీలకమన్న సీబీఐ… అందుకు నిజనిర్ధారణ కోసం అనుమతించాలని కోరగా కోర్టు ఒప్పుకోలేదు.