ఇరు వర్గాలను రెచ్చగొట్టే విధంగా బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రసంగించారంటు గతంలో నమోదైన 3 కేసులను కోర్టు కొట్టివేసింది. రెయిన్ బజార్, అఫ్జల్ గంజ్, సరూర్ నగర్ లలో రాజా సింగ్ పై మూడు కేసులు నమోదయ్యాయి. అయితే ఆ మూడు కేసులు కొట్టివేస్తూ ప్రజాప్రతినిధులు కోర్టు నేడు తీర్పునిచ్చింది.
ఇక గతంలో కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నోసార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.