జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తరచుగా వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పై విమర్శలు, ట్వీట్ లు చేసే వారిలో ఏపి మంత్రి అంబటి రాంబాబు కూడా ముందు వరుసలో ఉన్నారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆయనను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నేతల పిటిషన్ పై కోర్టు .. మంత్రి అంబటికి షాక్ ఇచ్చింది.
సంక్రాంతి డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అమ్మించి, డబ్బులు దండుకుంటున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై జనసేన నాయకులు పోలీసులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదునకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు.
వెంకటేశ్వరరావు పిల్ పై విచారణ జరిపిన కోర్టు .. మంత్రి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్కీ డ్రా పేరుతో మంత్రి అంబటి రాంబాబు నేత-త్వంలో టికెట్లను బలవంతంగా అండగడుతున్నారంటూ జనసేన ఆరోపించింది. దీనిపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. జనసేన నేతల ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో న్యాయస్థానంను ఆశ్రయించి కేసు నమోదు అయ్యేలా చేశారు.
ఇంతకు ముందు కూడా జనసేన కార్యకర్తలు అంబటిపై పలు ఆరోపణలు చేశారు. ప్రమాదంలో కుమారుడు చనిపోయిన బాధితురాలికి ప్రభుత్వం నుండి వచ్చిన నష్టపరిహారంలో మంత్రి వాటా ఆడిగారని ఆరోపించారు. ఆ బాధితురాలి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.