కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2013 లో ఆయనపై నమోదైన భూమి డీనోటిఫికేషన్ ఫిర్యాదుకు సంబంధించి కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
యడియూరప్పపై అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 13(2)తో పాటు సెక్షన్ 13(1)(డి) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది.
ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యడ్యూరప్ప బెంగళూరులోని బెల్లందూర్ సమీపంలోని 4.30 ఎకరాల భూమిని డీనోటిఫై చేశారని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై 2015లో దర్యాప్తునకు లోకాయుక్త స్పెషల్ కోర్టు ఆదేశించింది. దీంతో దర్యాప్తు చేసిన అధికారులు ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని అధికారులు తెలిపారు.
ఈ మేరకు బి నివేదికను ఇచ్చారు. దీన్ని లోకాయుక్తా కోర్టు తోసిపుచ్చింది. కేసుపై మళ్లీ విచారణ జరపాలని గతంలో ఆదేశించింది.