పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులను అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలివ్వాంటూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు పిటిషన్ ను తిరస్కరించగానే లాయర్లు ”షేమ్ షేమ్” అంటూ నినదించారు.
గత ఆదివారం రోజు యూనివర్సిటీ క్యాంపస్ లో జరిగిన లాఠీచార్జ్ పై దర్యాప్తుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది.