యువతి హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. కరీంనగర్ జిల్లా కటారం మండలం, శంకరంపల్లికి చెందిన వంశీధర్, గోదావరిఖనికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని కొంత కాలం వెంట పడ్డాడు. దానికి ఆ యువతి నిరాకరించింది. దాంతో కోపోద్రికుడైన వంశీధర్ యువతిపై కక్ష సాధించాలనుకున్నాడు. 2018లో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఆ యువతి గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు.
ఈ కేసులో అప్పట్లో కేసు నమోదైంది. జైలుకు వెళ్లిన నిందితుడు కొంత కాలానికి బెయిల్ పై బయటికి వచ్చాడు. ఆ కేసు విషయమై విచారణ చేపట్టిన కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తున్నట్టు కోర్టు తీర్పులో పేర్కొంది. అయితే… 2018లో యువతిని హత్య చేసిన తర్వాత వంశీధర్ కూడా ఆత్మహత్యకు యత్నించాడు.