మీడియా లెజెండ్ రవిప్రకాశ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రవిప్రకాశ్‌ను జీవితకాలం జైల్లో ఉంచాలనుకుంటున్నారా… అని ప్రశ్నించింది. 3 సంవత్సరాల జైలు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదైన కేసులో కస్టడీ ఎందుకని సూటిగా ప్రశ్నించింది. మరికొద్దిసేపట్లో బెయిల్ వస్తుందన్న దశలోనే 5నెలల నుండి గుర్తుకు రాని కేసు మీకు గుర్తుకు వచ్చిందా అని పోలీసులను ప్రశ్నించింది కోర్టు.
ఇప్పటి వరకు నమోదైన కేసులలో పోలీస్ విచారణపై ఎల్లుండి వరకు స్టే కొనసాగించాలని ఆదేశిస్తూ… ఎల్లుండికి ఫైనల్ విచారణ వాయిదా వేసింది.