వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. నాలుగు సంవత్సరాల పాటు విచారణ అనంతరం తీర్పు ప్రకటించనుంది న్యాయస్థానం. ఈ కేసులో మొత్తం 388 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు.
చార్జ్ షీట్ లో 12 మందిని నిందితులుగా చేర్చారు. 300 మందికి పైగా వ్యక్తులను విచారించినట్లు తెలిపారు పోలీసులు. 80 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి సహకరించిన పోలీసులపైనా డిపార్ట్ మెంట్ పరంగా చర్యలు తీసుకోనున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసు అధికారుల పాత్రపై ఉత్కంఠ నెలకొంది.
2019 జనవరి 30న చిగురుపాటి జయరాంను జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటినుంచి రాకేష్ రెడ్డి తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారిద్దరి మధ్య ఆర్ధిక లావాదేవీల గురించి గొడవ జరిగింది. అనంతరం జయరాంను నిర్భందించి రాకేష్ రెడ్డి హత్యచేశాడు. తర్వాత శవాన్ని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నందిగామ సమీపంలో పడేశాడు.
ఈకేసులో రాకేష్ రెడ్డి మొదటి నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. చంచల్ గూడ జైలులో ఉండి కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు.