హైదరాబాద్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి పొందడం మరింత ఊరటనిస్తోంది. కాగా కొత్తరకం కరోనా వైరస్‌పై కూడా తాము అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనిచేస్తుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లోని ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ లోని 2 విభాగాలు ఈ కొత్తరకం వైరస్ సమర్థవంతంగా అడ్డుకుంటాయని ఆ సంస్థ చెబుతోంది. దీంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనా వైరస్ నివారణలో ముఖ్యమైనదిగా మారే అవకాశం కనిపిస్తోంది.
ICMR -భారత్ బయోటెక్ కలిసి కోవాగ్జిన్‌ను రూపొందిస్తున్నాయిఆ. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 23 వేల మంది వాలంటీర్లను భారత్ బయోటెక్ రిక్రూట్ చేసుకుంది. మొత్తం 26 వేల మందిపై క్లినికల్ ట్రయల్ చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. త్వరలోనే దాన్ని చేరుకుంటామని ధీమాగా చెబుతోంది.
Bharat Biotech has announced successful recruitment of 23,000 volunteers, and continued progress towards achieving the goal of 26,000 participants for Phase-3 clinical trial of COVAXIN across multiple sites in India: Bharat Biotech
మరో 2 నెలల్లో క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకుంటాయని, దీన్ని అత్యవసరంగా ఉపయోగించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అప్లై చేసుకున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాదు ముక్కు ద్వారా కోవాగ్జిన్ టీకా ఇస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని సంస్థ ప్రకటించటం సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే వార్త. ప్రస్తుతం 20,000 మంది వాలంటీర్లపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ సాగుతుండగా అతి త్వరలో వీటి ఫలితాలు రానున్నాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ బయోటెక్ ముందుండగా సింగిల్ డోస్ నాజల్ వ్యాక్సిన్ గా కోవాగ్జిన్ ఇచ్చేందుకు కృషి చేస్తోంది.