దేశంలో కరోనా అదుపులోకి వస్తున్నట్లే కనిపిస్తోంది. గత 24 గంటల్లో 11,65,006 మందికి పరీక్షలు జరపగా.. 26,041 మందికి పాజిటివ్ అని తేలింది. 276 మంది చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా మృతి చెందిన వారి సంఖ్య 4.47 లక్షలకు చేరింది.
రికవరీ రేటు 97.78 శాతానికి పెరిగింది. కొత్తగా 29,621 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఓవరాల్ రికవరీలు 3.29 కోట్లకు చేరాయి. తాజాగా బయటపడ్డ 26వేల కేసుల్లో 15,951 కేరళ నుంచే ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో 3,206 కేసులు వెలుగుచూశాయి.
యాక్టివ్ కేసులు 191 రోజుల తర్వాత 3 లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం 2,99,620 మంది వైరస్ తో బాధపడుతున్నారు. ఇటు టీకా ప్రక్రియ దేశంలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 86 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. గత 24 గంటల్లో 38.18 లక్షల మందికి టీకా వేశారు.