ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమై.. తాను మాత్రం ప్రశాంతంగా ఉన్న చైనా.. ఆ పాపపు ఫలితాన్ని అనుభవిస్తోంది. దాదాపు కరోనా వైరస్‌ను కంట్రోల్ చేశామని చెప్పుకుంటున్న చైనాలోకి.. ఇతర దేశాల నుంచి మళ్లీ వైరస్ వచ్చి చేరుతోంది. డ్రాగన్ కంట్రీ పొరుగుదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల్లో కరోనా వైరస్ బయటపడుతోందని తెలిసింది.
భారత్‌తో పాటు ఇండోనేషియా, బ్రెజిల్, ఈక్వెడార్, రష్యా దేశాల నుంచి చైనాకు వచ్చిన ఆహార పదార్థాల్లోనూ వైరస్ జాడ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ముఖ్యంగా చేపలు ఇతర సీ ఫుడ్‌కు సంబంధించి వస్తున్న ఆ దేశానికి వస్తున్న పదార్థాల్లో కరోనా వైరస్ ఉంటోంది. దీంతో ఆయా దేశాల నుంచి దిగుమతులను చైనా తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాయిటర్స్ ఓ కథనాన్ని రాసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.