దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా 20వేల దిగువకు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 18,870 మందికి పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,82,520గా ఉంది. 194 రోజుల తర్వాత ఇదే తక్కువ సంఖ్య.
రికవరీ రేటు 97.83 శాతానికి పెరిగింది. కొత్తగా 28,178 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,29,86,180 మంది కరోనాను ఓడించారు.
దేశంలో వైరస్ ను అదుపు చేయడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 87.66 కోట్ల టీకాలు వేశారు. మరోవైపు టెస్టుల సంఖ్య 56.74 కోట్లు దాటింది.