దేశంలో మరోసారి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,847 కేసులు నమోదవ్వగా.. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. కరోనా నుండి కోలుకున్న 7,985 మందితో కలుపుకొని.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.64 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.15 శాతానికి చేరింది.
ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 43,270,577 కు చేరగా.. కరోనా కారణంగా 5,24,817 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా నుండి మొతం 4,26,82,697 కోలుకోగా.. 63,063 యాక్టివ్ కేసులున్నాయి.
భారత్ లో గురువారం 15,27,365 మందికి టీకాలు అందించగా.. మొత్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,84,03,471 కోట్లకు చేరింది. మరో 5,19,903 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజే 5,62,029 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,368 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 54,30,32,268 కు చేరుకోగా.. మరణాల సంఖ్య 63,37,911కు చేరింది. ఒక్కరోజే 4,15,821 మంది మహమ్మారి నుండి బయటపడ్డారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 518,146,962 కు చేరింది.