కరోనాకు నాజల్ ( ముక్కు ద్వారా తీసుకునే) వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. నాజల్ వ్యాక్సిన్ ను తీసుకు వచ్చేందుకు భారత్ బయోటెక్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ వ్యాక్సిన్ కు సంబంధించి క్లీనికల్ ట్రయల్స్ థర్డ్ ఫేజ్ పూర్తయినట్టు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. దీనికి సంబంధించిన డేటాను జూలైలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు పంపనున్నట్టు తెలిపారు.
‘వ్యాక్సిన్ థర్డ్ ఫేజ్ క్లీనికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం క్లీనికల్ ట్రయల్స్ డేటాపై విశ్లేషణలు చేస్తున్నాము. తర్వాత దాన్ని డేటా రెగ్యులేటరీ ఏజెన్సీకి పంపుతున్నాము. అంతా ఒకే అయితే ఆ తర్వాత నాజల్ వ్యాక్సిన్ కు అనుమతులు తీసుకుంటాము’ అని ఆయన పేర్కొన్నారు.
బూస్టర్ డోసు ఇమ్యూనిటీని పెంచుతుందన్నారు. ప్రతి వ్యాక్సిన్ కు బూస్టర్ డోసు అనేది అద్భుతమైన డోసు అని అన్నారు.
పిల్లల్లోనూ మొదటి, రెండవ డోసులు ఎక్కువ రోగనిరోధక శక్తిని ఇవ్వవన్నారు. కానీ పిల్లలకు మూడవ డోసు అద్భుతమైన ప్రతిస్పందనను ఇస్తుందన్నారు. పెద్దవారిలోనూ ఇది వర్తిస్తుందన్నారు.