దేశంలో 12 నుంచి 14 ఏండ్ల గ్రూపు వారికి వ్యాక్సిన్ పంపిణీ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈ గ్రూపు వారికి బయోలాజికల్ ఈ కంపెనీ తయారుచేసిన కోర్బవ్యాక్స్ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ బుధవారం ట్వీట్ చేశారు. సబ్ కో వ్యాక్సిన్.. ముఫ్త్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ కింద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నట్టు ట్వీట్ లో తెలిపారు.
‘ 12-14 ఏండ్ల గ్రూపు వారికి వ్యాక్సినేషన్ బుధవారం నుంచి ప్రారంభం అయింది. 60 ఏండ్లకు పైబడిని వారందరూ నేటి నుంచి ప్రికాషన్ డోసు పొందవచ్చును” అని పేర్కొన్నారు.