• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » కరోనా టీకా తయారీ సంస్థలు కీలక ప్రకటన

కరోనా టీకా తయారీ సంస్థలు కీలక ప్రకటన

Last Updated: April 9, 2022 at 9:25 pm

దేశ వ్యాప్తంగా బూస్టర్ డోసులు 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌ శనివారం గుడ్ న్యూస్ చెప్పాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాల ధరలు భారీగా తగ్గించాయి. 18 ఏళ్లు పైబడిన వారు బూస్టర్ డోసులను ప్రైవేటు కేంద్రాల్లో మాత్రమే తీసుకోవాలని కేంద్రం తెలిపిన నేపథ్యంలో టీకా తయారీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రులకు కొవిషీల్డ్‌ టీకా డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు సీరమ్‌ సీఈఓ అదర్‌ పూనావాలా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అటు భారత్‌ బయోటెక్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రులకు కొవాగ్జిన్‌ టీకా డోసు ధరను రూ.1200 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించినట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు.

వయోజనులు అందరికీ బూస్టర్ డోసును అందుబాటులోకి తేవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వీరిద్దరూ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని పేర్కొన్నారు. తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. అయితే, టీకా ధరతో పాటు అదనంగా సర్వీస్​ ఛార్జ్​ చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ ఛార్జీలు గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటు కేంద్రాలను సూచించింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా ధరలు గరిష్ఠంగా రూ.375 (సర్వీసు ఛార్జీలు కలుపుకుని) ఉండనున్నాయి.

We are pleased to announce that after discussion with the Central Government, SII has decided to revise the price of COVISHIELD vaccine for private hospitals from Rs.600 to Rs 225 per dose. We once again commend this decision from the Centre to open precautionary dose to all 18+.

— Adar Poonawalla (@adarpoonawalla) April 9, 2022

Announcing #CovaxinPricing .
We welcome the decision to make available precautionary dose for all adults. In consultation with the Central Government, we have decided to revise the price of #COVAXIN from Rs 1200 to Rs 225 per dose, for #privatehospitals.🇮🇳💉💉💉😷

— Suchitra Ella (@SuchitraElla) April 9, 2022

Advertisements

కొవిడ్ కొత్త రకం వేరియంట్లు మళ్లీ పుట్టుకొస్తున్న క్రమంలో దేశంలో బూస్టర్ డోసుల పంపిణీకి రంగం సిద్దమైంది. 18 ఏళ్లు పైబడిన వారందరూ ఏప్రిల్‌ 10 (ఆదివారం) నుంచి బూస్టర్ డోసు తీసుకోవచ్చని వెల్లడించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు ఈ డోసుకు అర్హులని తెలిపింది. అయితే ప్రైవేటు టీకా కేంద్రాల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

ఇక, ఇప్పటి వరకు దేశంలో 15 ఏళ్లు పైబడిన 96 శాతం మంది కనీసం ఒక డోస్ వ్యాక్సిన్‌ని తీసుకున్నారు. ఇదే సమయంలో 15 ఏళ్లు దాటిన వారిలో 83 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటు 60 ఏళ్లు దాటిన జనాభాలో 2.4 కోట్ల మందికి బూస్టర్ డోస్ అందించారు. 12 నుంచి 14 ఏళ్ల వయస్సు గల వారిలో 45 శాతం మంది కూడా ఫస్ట్ డోస్‌ను తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

కాగా, బూస్టర్ డోసు కోసం ప్రత్యేకంగా మళ్లీ కొత్తగా నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొవిన్‌ యాప్‌లోకి వెళ్లి ప్రికాషన్ డోసు కోసం అపాయింట్‌మెంట్ బుక్‌ చేసుకుంటే సరిపోతుంది. లేదా నేరుగా ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవచ్చు. తొలి రెండు డోసులు ఏ రకం టీకా అయితే తీసుకున్నారో బూస్టర్ డోసు కూడా అదే తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఆ నిబంధన తొలగించాలి

అన్నీ అవినీతి, కుటుంబ పార్టీలే.. ఒక్క ఛాన్స్ ప్లీజ్

చిన్న పిల్లలకు నెయ్యి వేయడం మంచిదేనా…?

పొట్లకాయ కోడిగుడ్డు కలిపి తింటే ఏం జరుగుతుంది…?

అడ్డుకున్న మహిళలు.. తోసుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే!

సారూ.. వయో పరిమితి పెంచండి.. రేవంత్‌ బహిరంగ లేఖ

అప్పట్లో సినిమా ప్రమోషన్ ఎలా ఉండేది…? తెలుగు వాళ్లకు సినిమా అంటే ఎందుకు అంత పిచ్చి…?

బడిపై కమ్ముకున్న..అవినీతి “మేఘా” లు !

సర్పంచ్‌ ల ధిక్కార స్వరం!

సాయి పల్లవి సక్సెస్ సీక్రెట్ ఏంటీ…? ఫాన్స్ కు ఎక్కడ కనెక్ట్ అయింది…?

సినిమాల‌ను త‌ల‌పించే జులుం..!

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

ఫిల్మ్ నగర్

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య... పట్టించుకోని శృతిహాసన్?

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య… పట్టించుకోని శృతిహాసన్?

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)