గుజరాత్ లో కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలకలం రేపింది. ముంబైలో ఇటీవల కొత్త వేరియంట్ ఎక్స్ఈ కేసు నమోదైనట్టు వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయి. ఆ తర్వాత ఆ వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ లో ఎక్స్ఈ కేసుపై వార్తలు రావడంతో అధికారులు కలవరపడుతున్నారు. అయితే దీనిపై అధికారులు ఇప్పుడే ఏం స్పందించడం లేదు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలకు మరి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
దీంతో ఇప్పుడే ఆ కేసును కరోనా ఎక్స్ఈ గా నిర్దారించలేమని అధికారి ఒకరు వెల్లడించారు. ముంబైలోనూ ఇలాంటి వార్తలే గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలో జీనోమ్ సీక్వెన్సింగ్ అనంతరం కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పందించింది.
ముంబైలో కరోనా ఎక్స్ఈ కేసు నమోదుకాలేదని, జీనోమ్ సీక్వెన్సింగ్ లో అలాంటి ఫలితాలు ఏమీ కనిపించలేదని కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజా కేసుపై జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఎలాంటి ఫలితాలు వెలుబడుతాయో చూడాలి.