విశాఖపట్నంకు చెందిన 65సంవత్సరాల ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కరోనా వైరస్ లక్షణాలున్న సమయంలో విశాఖ నుండి హైదరాబాద్ మెహిదిపట్నంలోని తన కూతురు ఇంటికి రావటంతో ఏపీ అధికారులు తల పట్టుకుంటున్నారు. మార్చి 10న కాచిగూడ-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రయాణం చేసినట్లు అధికారులు గుర్తించారు.
మక్కా సందర్శనకు వెళ్లిన ఆ వ్యక్తికి ఫిబ్రవరి 26న తిరిగి వచ్చాడు.శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి వైజాగ్ కు వెళ్లిన అతడు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. మార్చి 20న వచ్చిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఎవరెవరిని కలిశారన్నకోణంలో అటు ఏపీ అధికారులు, ఇటు తెలంగాణ అధికారులు దృష్టిపెట్టారు.
విశాఖలోని అల్లిపురం కాలనీలో నివాసం ఉండే అతను… విశాఖకు తిరిగి వచ్చాక స్థానిక సురక్ష డయగ్నోస్టిక్ సెంటర్ లో పరీక్షలు చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. మార్చి 17వరకే ఆయనకు కరోనా సోకిన వారం తర్వాత ఆయన హైదరాబాద్ కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. విశాఖ ఆసుపత్రి వైద్యులు తిరుపతి రిమ్స్ ఆసుపత్రికి ఆ వ్యక్తి నమునాలు పంపగా కరోనా సోకినట్లు తేలటంతో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
దీంతో ఆయన విశాఖలో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని విశాఖ వైద్యాధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఏపీలో కరోనా పాజిటివ్ ల సంఖ్య 3కు చేరింది.