కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అత్యవసర ఉపయోగం కోసం భారత్ లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. కోవిషీల్డ్, కోవాక్జిన్ లను ఇప్పటికే దేశం అంతటా పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి అజాగ్రత్తలు లేకుండా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
కానీ చిన్న అజాగ్రత్త వల్ల ఏకంగా 1000కరోనా వ్యాక్సిన్ డోసులు పాడైపోయాయి. అస్సాం రాష్ట్రంలోని సచార్ జిల్లాలోని సిల్చర్ మెడికల్ అండ్ ఆసుపత్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ నిల్వ చేసి, అక్కడి నుండి పంపిణీ చేస్తున్నారు. కానీ అక్కడి సిబ్బంది అవగాహాన లోపంతో దాదాపు 100 వయాల్స్- (ఒక్కో వయాల్ లో 10డోసులుంటాయి)ను జీరో డిగ్రీలో స్టోర్ చేశారు. దీంతో వ్యాక్సిన్స్ గడ్డ కట్టేసినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు.
ఆక్స్ ఫర్డ్- అస్ట్రాజెనికా తయారు చేసిన ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ లను 2-8డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ టెక్నికల్ లోపం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని ఆసుపత్రి వర్గాలంటున్నాయి. దీనిపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖను కేంద్రం వివరణ కోరుతూ, ఆ వెయ్యి వ్యాక్సిన్లను వెంటనే రీప్లేస్ చేయబోతున్నారు.