అస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను బ్రిటన్ లో ప్రారంభించారు. ఆక్స్‌ఫర్డ్‌లోని ఓ ఆసుపత్రిలో డయాలసిస్ రోగి అయిన 82ఏళ్ల బ్రియాన్ పింకర్‌కు తొలి వ్యాక్సిన్ ఇచ్చారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్రియాన్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీన్ని ఓ మైలురాయిగా అభివర్ణించింది ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థ.
వ్యాక్సిన్ వేయించుకోవటం ఆనందంగా ఉందన్న బ్రియాన్.. ఇప్పుడు ప్రశాంతంగా డయాలసిస్‌కు వైద్యం చేయించుకుంటానని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్నాక తన ఆరోగ్యం సేఫ్ అని భావిస్తున్నానని, తన భార్యతో 48వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటానని బ్రియాన్ పరటించారు. ఇప్పటికే కరోనా నివారణకు ఫైజర్ టీకాతో భారీ స్థాయిలో బ్రిటన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ నిర్వహిస్తోంది.
బ్రిటన్ తర్వాత ఈ టీకాను ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో భారీ ఎత్తున ఇండియాలో కరోనా అత్యవసర వ్యాక్సినేషన్ ప్రొగ్రాం చేపట్టనున్నారు.