సీరం క్యాంపస్‌లోని టర్మినల్ గేట్-1 వద్ద ఉన్న బిల్డింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై క్లారిటీ ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఆ బిల్డింగ్‌లో కోవిషీల్డ్ ఉత్పత్తి కావడం లేదని తెలిపింది. అందులో రోటావైరస్, బీసీ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నట్టు స్పష్టం చేసింది. కోవీషీల్డ్ తయారు చేసే భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని వివరించింది.
సీరం ఇనిస్టిట్యూట్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థగా పేరు సంపాదించుకుంది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కాతో కలిసి కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే అనేక దేశాల నుంచి కోవిషీల్డ్‌కు ఆర్డర్లు వచ్చాయి. పుణెలోని దాదాపు వంద ఎకరాల్లో దీని క్యాంపస్ ఉంది. అందులో మంజరి అనే కాంప్లెక్స్‌లో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో నలుగురు వ్యక్తులు.. బిల్డింగ్‌లో ఉండగా.. వారిని రెస్యూ సిబ్బంది కాపాడారు.