కోవావాక్స్ టీకాకు బూస్టర్ డోసుగా 15 రోజుల్లో ఆమోదం లభించనున్నట్లు వెల్లడించారు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా. భారతి విద్యాపీఠ్ యూనివర్సిటీ ఈవెంట్ లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూనావాలా మాట్లాడుతూ.. కేంద్రం వద్ద కోవీషీల్డ్ టీకాల స్టాక్ ఉందని తెలిపారు. కోవావాక్స్ వ్యాక్సిన్ కరోనాకు చెందిన ఒమ్రికాన్ వేరియంట్ పై కూడా ప్రభావంతంగా పని చేయనున్నట్లు పేర్కొన్నారు.
అయితే కోవీషీల్డ్ వ్యాక్సిన్ కన్నా.. కోవావాక్స్ బెస్ట్ బూస్టర్ గా పనిచేస్తుందన్నారు. కరోనా సమయంలో ఇండియా 80 దేశాలకు సహాయం కూడా అందించిందని ఆయన తెలిపారు.
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని, హెల్త్ కేర్ అంశంలో భారీ జనాభా ఉన్న మన దేశం ఎలా జాగ్రత్తలు తీసుకుంటుందో గమనిస్తున్నారన్నారు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా.