బట్టల షాపులోకి ప్రతిరోజూ ఒక ఆవు రావడం….వచ్చి అక్కడే 2-3 గంటలు కూర్చొని పోవడం దానికి అలవాటుగా మారింది. ఈ సంఘటన కడప జిల్లా మైదుకూరులో జరిగింది. మైదుకూరులో ఒబయ్య అనే వ్యక్తి నడుపుతున్న బట్టల దుకాణంలోకి ఓ ఆవు బయటి ఎండలకు తాళలేక వచ్చేది.
బట్టల షాపులో క్రింద పరిచిన పరుపుల మీద హాయిగా కాసేపు సేద తీరేది. ఈ సమయంలో మల మూత్రాలతో ఆ పరుపులను పాడు చేయడం కానీ, కస్టమర్లను ఇబ్బంది పెట్టడం కానీ చేసేది కాదు. అలా ప్రతి రోజూ రావడం 2-3 గంటల పాటు అక్కడే కూర్చొని వెళ్లడం దాని దిన చర్యగా మారింది. ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఆవు అక్కడి నుండి వెళ్ళిపోయేది. ఇక కస్టమర్లు సైతం ఆ షాప్ లోని ఆవుకు పండ్లు తెచ్చిపెట్టేవారు. ఇక ఆ ఆవు రాకతో తన గిరాకీ నాలుగు రెట్లు పెరిగింది అంటున్నాడు ఆషాప్ ఓనర్!
Advertisements
గత ఏడాది ఇలా వచ్చిన ఆవు…. ఆ తర్వాత మెల్లిమెల్లిగా రావడం మానేసిందట!