పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు హైదరబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద మాట్లాడుతూ… సిటి లో 80 మంది మహిళా ఎస్ ఐ లు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు.
మహిళ దినోత్సవం సందర్భంగా మొదటి మహిళా లా అండ్ ఆర్డర్ SHO ను నియమిస్తున్నామని ప్రకటించారు ఆనంద్. 8వ తారీకున మహిళా దినోత్సవం రోజు అధికారికంగా నియమిస్తామని తెలిపారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30% మంది మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఎన్ సి అర్ బి డేటా ప్రకారం మహిళలు నివసించేందుకు హైదరాబాద్ సేఫ్ ప్రాంతం అని పేర్కొన్నారు.
అలాగే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 12వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎలాంటి ర్యాలీలు, రాస్తారోకోలు, సభలకు ఆందోళనలకు అనుమతి లేదని కూడా తెలిపారు.