కార్పొరేట్ల ప్యాకేజ్ కాదు... కార్మికుల,పేదల ప్యాకేజ్ కావాలి - Tolivelugu

కార్పొరేట్ల ప్యాకేజ్ కాదు… కార్మికుల,పేదల ప్యాకేజ్ కావాలి

పేదలు,కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్నారు సిపిఎం నేత సిహెచ్ బాబూరావు. కరోనా కష్టకాలంలో కార్మిక హక్కులను హరిస్తూ కార్మిక చట్టాలకు సవరణలు చేయడం సిగ్గు చేటుని విమర్శించారు. కార్మికులు,పేదల భద్రత ప్రమాదంలో పడింది. లాక్ డౌన్ పేరుతో ప్రజల గొంతు నొక్కడం, ఉద్యమాలను అణిచివేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కరోనా లాక్ డౌన్ తో రవాణా,మోటార్ రంగ కుదేలైందన్నారు. ప్రపంచంలో పెట్రోలు ఉత్పత్తుల రేట్లు తగ్గగా, మనదేశంలో పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించక పోగా లీటర్ కు10రూపాయల నుండి13 రూపాయల వరకు రేట్లు పెంచడం అన్యాయమన్నారు. మరో వైపు టోల్ గేట్ ఛార్జీలు మరింత భారం అయ్యాయని తెలిపారు.

ఆటో,లారీ,టాక్సీ తదితర డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, కరోనా లాక్ డౌన్ సమయంలో వాహనాలపై వేసిన ఫైన్లను రద్దు చేసి ,కేసులుఎత్తివేసి వాహనాలను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. 50వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ఉన్నప్పటికీ కార్మికులకు నయాపైసా సహాయం చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వాలు పిఎఫ్ లో ఇచ్చిన రాయితీలు అరకొరగానే ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయానికి వేతనాలు ఇప్పించడానికి ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు, పైపెచ్చు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం కోత పెడుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడానికి ఆర్టీసీతో సహా అనేక రంగాలు ప్రయత్నిస్తున్నాయి.సంపద సృష్టించే కార్మికులు,పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు బాబు రావు. ఫకీర్ గూడెంలో పర్యటించిన బాబురావు,సిపిఎం,సిఐటియు నేతలు..ఆటోవర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు కూరగాయలు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు .

Share on facebook
Share on twitter
Share on whatsapp