కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆంక్షల మధ్య సభ జరుపు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.ప్రశ్నించే గొంతులను మూసివేస్తావా కేసీఆర్ ఖబర్దార్ అంటూ మండిపడ్డారు.
80 వేల పుస్తకాలు చదివిన కెసిఆర్ , అసలు రాజ్యాంగాన్ని చదవడం మానేశారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ మాటలే ఆర్టీసి కార్మికుల ప్రాణాలు తీస్తున్నా యన్నారు.
ఆత్మహత్యలు వద్దు..పోరాడి కొట్లాడి ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు.