తెలంగాణలో కరోనా వైద్యం చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అత్యల్ప టెస్టింగ్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తుంటే కనీసం సమీక్ష చేయకపోవటం కేసీఆర్ బాధ్యతారాహిత్యమన్నారు.
ప్రగతి భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్ట్ చేయటాన్ని తప్పుబట్టిన ఆయన… విపక్షాలతో కలిసి హైదరాబాద్ సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.