ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ బిల్లులు తగ్గించాలని సిపిఐ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది . ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. మే 18న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది . ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ , మే నెలల్లో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయి. విద్యుత్ టారిఫ్ స్లాబుల్లో మార్పులు చేసి బిల్లులు భారీగా పెంచేశారు . అంతే కాదు కరోనా కారణంగా బిల్లులు కట్టలేని వినియోగదారులపై పెనాల్టీ కూడా వేశారు .. రీ కనెక్షన్ చార్జీలు కుడా వసూల్ చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు కేంద్రం విద్యుత్ చట్టంలో తీసుకొచ్చిన సవరణలపై సిపిఐ భగ్గుమంటోంది . కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరుస్తూ వినియోగదారులకు ఇచ్చే రాయితీలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు .
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా మే 18 ఉదయం 9గంటల నుండి 10గంటల వరకు ఎక్కడివారు అక్కడే ఉంది వివిధ రూపాల్లో నిరసన తెలపాలని సిపిఐ అప్ రాష్ట్రశాఖ పిలుపునిచ్చింది .