తెలంగాణలో 50వేల ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వార్తలు వస్తున్న తరుణంలో అసలు రాష్ట్రంలో ఎన్ని ఖాళీలున్నాయో చెప్పాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఖాళీల భర్తీని స్వాగతిస్తామన్న ఆయన, యుద్ధప్రాతిపదికన చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్న సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి… గతంలో సీఎం ఈ అంశంపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఓవైపు ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో పాటు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.