వానాకాలం పంటను వెంటనే కొనుగోలు చేయాలని హుస్నాబాద్ లో సీపీఐ ధర్నా నిర్వహించింది. యాసంగిలో రైతులు వరి సాగు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు విధించరాదని డిమాండ్ చేసింది. అయితే సీపీఐ నేతలు ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు.
సీపీఐ నాయకులు గేట్లను నెట్టుకుంటూ లోపలికి దూసుకెళ్లారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.