కొన్ని రోజులుగా శ్వాస కోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సీపీఐ సీనియర్ నేత మాజీ ఎంపి గురుదాస్ గుప్తా ఈ రోజు ఉదయం కన్నుమూశారు.గత కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.గురు దాస్ గుప్తా వయసు 83 సంవత్సరాలు. ఇవాళ ఉదయం 6 గంటలకు కోల్‌కతాలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.1936 నవంబరు 3న బారిసాల్‌లో జన్మించారు గురుదాస్.1985,1988,1994లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2001లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2004, 2009 లో లోక్ సభ కు ప్రాతినిధ్యం వహించారు. ఈ సమయంలో సీపీఐ తరఫున లోక్‌సభా పక్షనేతగా వ్యవహరించారు. పలువురు గురుదాస్ గుప్తా మృతికి నివాళి అర్పించారు