సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న మారుమూల ప్రాంతమైన అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపే మల్లేష్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి భవనం నిర్మించి ఏండ్లు గడుస్తున్నాయి అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ లు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారి పనితీరుకు నిదర్శనమని వారు అన్నారు.
రామవరం ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం కోసం కృషి చేయాలని మంత్రి హరీష్ రావు ను కోరారు. రామవరం ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల మందు బాబులకు ఇది అడ్డాగా మారిపోయిందని వారు ఆరోపించారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఆసుపత్రిని త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.