ఆంధ్రప్రదేశ్ ఆటవిక రాజ్యంలో ఉందో ,నాగరిక సమాజంలో ఉందో అర్ధం కావడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాస్కులు లేవని ప్రశ్నించాడన్న కారణంతో ఒక డాక్టర్ ను సస్పెండ్ చేసి , విశాఖ నడివీధుల్లో అర్ధనగ్న0గా, చేతులు వెనక్కి విరిచి కట్టేసి పోలీసులు దారుణంగా కొట్టడాన్ని నారాయణ తీవ్రంగా ఖండించారు .
సస్పెండైన డాక్టర్ సుధాకర్ ఆతరువాత ఉద్యోగంలోకి తీసుకోమని ప్రాధేయపడ్డారు .తరువాత నెల రోజుల పాటు సైలెంట్ గానే ఉన్నారు. ఈ రోజు సడెన్ గా విశాఖ వీధుల్లో ప్రత్యక్షమయ్యారు. నేరపూరిత చేర్యాలకు పాల్పడినవారిపైనా , అత్యాచారాలకు పాల్పడిన వారిపైన ఈ విధమైన చర్యలు తీసుకోకుండా , ప్రశ్నించిన డాక్టర్ ను కొట్టడమేంటని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్ట పగలే ఇలా కొట్టడం చూస్తుంటే జగన్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందన్నారు . ప్రశాంతంగా ఉండే విశాఖను రాక్షస క్రీడలకు అడ్డాగా మారుస్తున్నారన్నారు . ఈ ఘటనను నారాయణ తీవ్రంగా ఖండించారు . న్యాయవ్యవస్థ కేసును సుమోటాగా తీసుకొని విచారించాలని కోరారు. పౌరహక్కుల సంఘం నాయకులు , వామపక్షాలు ప్రత్యక్ష కార్యాచరణతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు .