సత్యాన్ని చంపి, రవిప్రకాశ్‌ను జైలులో ఉంచాలనుకోటం చాలా దారుణమన్నారు సిపిఐ నేత నారాయణ. చంచల్ గూడ జైలులో ఉన్న రవి ప్రకాశ్‌ని కలిశారు. కార్పోరేట్ సంస్థల మధ్య జరుగుతున్న వివాదాన్ని సివిల్ కేసు లుగా మార్చి జైలులో పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, మీడియా రంగం లో రవి ప్రకాశ్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. సమాజం లో జరుగుతున్న అనేక అంశాలను రవి ప్రకాశ్ వెలుగులోకి తెచ్చారని, విద్యుత్ ఉద్యమ సమయంలో ఇష్యూను రవి ప్రకాష్ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని, జర్నలిస్ట్ లలో రవి ప్రకాష్ చేసిన కృషి ఎవ్వరు చేయలేదన్నారు.